మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ త్వరలోనే విరూపాక్ష అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో తేజ్ మాట్లాడుతూ..

తన పెళ్లి విషయంలోనూ చాలా క్లారిటీతో ఉన్నాడు. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని, మంచి అమ్మాయి కనిపిస్తే తప్పకుండా చేసుకుంటానని చెబుతున్నాడు.

ఇంతకుముందే తనకు ఓ అమ్మాయితో బ్రేకప్‌ అయ్యింది అని చెప్పాడు తేజు..ఇంటర్‌లో ఉన్నప్పుడు  నా బెస్ట్‌ఫ్రెండ్‌ అయిన ఓ అమ్మాయిని ప్రేమించా.

మొదట్లో మేమిద్దరం ప్రాణ స్నేహితులం. కానీ ఆ తర్వాత ప్రేమించుకున్నాం. కట్‌ చేస్తే.. డిగ్రీలో నేనే దగ్గరుండి ఆమెకు పెళ్లి చేశా. ఎందుకంటే అప్పటికీ నా దగ్గర డిగ్రీ పట్టా తప్ప ఏమీ లేదు.

ఇక సినిమాల్లో తిక్క సినిమా హీరోయిన్ లారిస్సా బోనేసి చూసి సాంగ్‌ షూటింగ్‌ సమయంలోనే ఆమెకు ప్రపోజ్‌చేశా.

‘నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఒప్పుకుంటే డేటింగ్‌ చేద్దాం’అని డైరెక్ట్‌గా అడిగేశా.కానీ ఆమె ఇచ్చిన రిప్లైకి నా హార్ట్ బ్రేక్ అయింది. సారీ తేజ్‌.. నాకు ఆల్రెడీ బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడని చెప్పింది. బాధతో వెళ్లిపోయా.

అయితే ఫైనల్ గా తన లైఫ్ లో ఒక క్రష్ ఉన్నారు ఆమె ఎవరో కాదు ఒక నటిగా, మనిషిగా అట్రాక్ట్ చేసింది సమంత. రెజీనా, సయామి అంటే కూడా చాలా ఇష్టం.