త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రమిది.
హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.
ఈ చిత్రంలో శ్రీలీల, పూజ పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ మాస్ లుక్‌లో కనిపించనున్నారు.
ఇదిలా ఉంటె చిత్ర ప్రేమికులకు శుభవార్త తెలిపింది ఈ చిత్రబృందం.
మే 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు మూవీ మేకర్స్.
శుక్రవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది మూవీయూనిట్.
ఈ మేరకు ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు మేకర్స్.
కాగా ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.