నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనుడూ సూపర్‌స్టార్ కృష్ణ
అన్నింటికి మించి ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలిచిన సాహసి. అంతేకాదు తెలుగు సినీ ప్రేక్షకులకు ఆయనే ఫస్ట్ కౌబాయ్, జేమ్స్ బాండ్ హీరో కూడా అతనే.
ఇక తెలుగు సినీ చరిత్రలో ఈయనకు మాత్రమే సాధ్యమైన కొన్ని రికార్డులు ఏంటో చూద్దాం
తొలి సోషల్ కలర్ సినిమా: తేనె మనసులు తొలి స్పై సినిమా: గూఢచారి 116 (1966)
తొలి కౌబాయ్ సినిమా: మోసగాళ్లకు మోసగాడు (1971) తొలి పూజీ కలర్ సినిమా: భలే దొంగలు (1976)
తొలి ORW కలర్ సినిమా: గూడుపుఠానీ (1972) తొలి RO సినిమా: కొల్లేటీ కాపురం (1976).
తొలి ఔట్ డోర్ షూటింగ్ సినిమా, తొలి స్కోప్ టెక్నోవిజన్ సినిమా: సాక్షి (1967). తొలి స్కోప్ సినిమా: అల్లూరి సీతారామరాజు (1974).
తొలి ఈస్ట్ మన్ కలర్ సినిమా: ఈనాడు (1982) తొలి 70 ఎంఎం సినిమా: సింహాసనం (1986).
తొలి డిటిఎస్ సినిమా: తెలుగు వీర లేవరా (1995).
తొలి డిటిఎస్ సినిమా: తెలుగు వీర లేవరా (1995). ఒకే ఏడాదిలో అత్యధిక సినిమాలు విడుదల చేసిన ఘనత కూడా సూపర్ స్టార్ సొంతం. 1972లో ఈయన 18 సినిమాల్లో నటించాడు.