సమ్మర్ అంటే మామిడిపండ్లే. మామిడి పంట్లు అంటే సమ్మర్. వేసవి వచ్చిందంటే చాలు.. అందరి కళ్లు మామిడిపండ్లపైనే..
సమ్మర్ స్టార్టింగ్ లో మామిడికాయలు మరింత ఖర్చుగా ఉంటాయి.. సామాన్యులు కొనలేరు అన్నట్టు.. అయితే..
ఈ మామిడిపండ్లలో చాల రకాలు ఉన్నాయి.. రకాన్ని బట్టి దీని రేట్ మారుతుంది.
దీంతో మామిడి పండు ప్రేమికులు దానిని కొనుగోలు చేయడాన్ని లేదా దానిని ఆస్వాదించడానికి ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తుంది.
ఈ సమస్యను పరిష్కరించేందుకు పూణేకు చెందిన ఓ మామిడి పండ్ల వ్యాపారి వాటిని ఈఎంఐ లో అమ్మాలని చూస్తున్నాడు..
ఇది నమ్మడానికి కొంచెం కష్టమే అయినా ఇది నిజమే.. ముందు మామిడిపండ్లు కొనొచ్చు.. తరువాత డబ్బులు చెల్లించావొచ్చు.
పూణేకు చెందిన గురు సనస్ గత పన్నెండేళ్లుగా మామిడి పళ్లను వ్యాపారం చేస్తూ EMIపై మామిడి పండ్లను అమ్ముతున్నాడు. దీని కోసం అతను Paytmతో టైఅప్ కూడా అయ్యాడు..
EMIలో మ్యాంగోను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ముందుగా వ్యక్తికి బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ అవసరం. అప్పుడు, ఈ సంబంధిత బ్యాంక్ కస్టమర్‌కు 3 నుండి 12 నెలల వరకు వాయిదాలను ఇస్తుంది.