టాలీవుడ్ టాలెంటెడ్ నటుల్లో సుహాస్ కూడా ఒకరు.

సుహాస్‌, టీనా శిల్పరాజ్‌ జంటగా షణ్ముఖ ప్రశాంత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రైటర్‌ పద్మభూషణ్‌’. 

ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ను తెచ్చుకుంది.

అంతేకాదు, ఫీల్‌గుడ్‌ మూవీగా విమర్శకుల ప్రశంసలూ అందుకుంది.

ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. 

‘రైటర్‌ పద్మభూషణ్‌’ ఓటీటీ రైట్స్‌ను జీ5 దక్కించుకున్న సంగతి తెలిసిందే. 

ఈ క్రమంలో మార్చి 17వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది.