శరీరానికి చక్కెర మాత్రమే కాదు.. ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్లు అవసరం. కానీ ఎక్కువ అయితే ప్రమాదం..

ఎక్కువ చక్కెర తినడం వల్ల శరీరంలో కొన్ని సంకేతాలు కనిపిస్తుంటాయి. అలా కనిపించే ఐదు సంకేతాలివే..

చక్కెర పదార్థాలు ఎక్కువ తినడం వల్ల బరువు పెరుగుతుంది. బరువు తగ్గకపోవడానికి ప్రధాన కారణం చక్కెరనే..

సరిగా నిద్రపట్టకపోయినా, నిద్రించడానికి ఇబ్బంది పడుతున్నా రాత్రిపూట చక్కెరతో కూడిన భోజనం తింటున్నారని అర్ధం.

అధిక చక్కెర ఆహారం తీసుకోవడం అనేది నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. ఇది హృదయ స్పందన రేటు, రక్తపోటు పెరుగుదలకు దారితీస్తుంది.

మొదట చక్కెర తీసుకున్నప్పుడు శక్తి వచ్చినట్లు అనిపించవచ్చు. ఇది కాలక్రమేణా అలసట, నీరసం, బద్ధకంగా మారేలా చేస్తుంది.

ఎక్కువ చక్కెరను తీసుకోవడం వల్ల మీ మెదడుపై ప్రభావం చూపుతుంది. చక్కెర కోరికలు (న్యూరోకెమికల్ డోపమైన్‌) పెరుగుతాయి.