జబర్దస్త్‌ కమెడియన్‌ వేణు దర్శకత్వంలో ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌ రామ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం బలగం

మంగళవారం ఈ చిత్రం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ సిరిసిల్లలోని బతుకమ్మ ఘాట్‌ జరిగిన విషయం తెలిసిందే

ఈ కార్యక్రమంలో సుడిగాలి సుధీర్‌ వేణు గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి

నేను అనేవాడిని ఈ స్టేజీలో ఉన్నానంటే అందుకు వేణు అన్ననే కారణం

నేను, నా కుటుంబ సభ్యులు ఈరోజు మూడు పూటలా తింటున్నామంటే అందుకు ఆయనే కారణం

నాకు జబర్దస్త్‌లో ఛాన్స్‌ ఇచ్చి నన్ను ఆదుకుంది వేణన్నకి జీవితాంతం తనకు రుణపడి ఉంటాను

వేణు అన్న దగ్గర మంచి టాలెంట్‌ ఉందని గుర్తించి ఆయనకు సినిమా తీసే ఛాన్స్‌ ఇచ్చిన దిల్‌ రాజుగారికి థ్యాంక్స్‌

ఈ సినిమా ఫ్యామిలీతో వెళ్లి చూడండి, సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది అని తెలిపాడు సుధీర్‌