సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. మొదట మ్యాజిక్ షో చేస్తూ జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
అలా ఇండస్ట్రీకి వచ్చిన అతి కొద్దిరోజుల్లోనే స్టార్ కమెడియన్ గా ఎదిగాడు.
సినిమాల్లో కూడా వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు..
ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బుల్లితెరపై ప్రసారం అవుతున్న షోలలో కనిపిస్తూ యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు.
ఇప్పుడు సినిమాలకు స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని టాక్..
‘గాలోడు’ కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఇది ఇలా ఉండగా.. ప్రస్తుతం సుధీర్ హీరో గా చేస్తున్న సినిమాలకు రెమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేస్తున్నాడని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది..
ఇప్పుడు ఒక్కో సినిమాకి రెండు కోట్ల రూపాయలకు తక్కువ డిమాండ్ చెయ్యడం లేదట. ప్రస్తుతం ఆయన గోట్ అనే చిత్రం లో హీరో గా నటిస్తున్నాడు.
తమిళం లో రీసెంట్ టైం లో సెన్సేషన్ గా మారిన యంగ్ హీరోయిన్ దివ్య భారతి ఇందులో సుధీర్ సరసన నటిస్తుంది.