మహేశ్ దర్శకత్వంలో వి. ఆనందప్రసాద్ నిర్మించిన సుధీర్‌బాబు హీరోగా, శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘హంట్’
ఈ మూవీలో సుధీర్ బాబు, శ్రీకాంత్, ప్రేమిస్తే భరత్ పోలీస్ ఆఫీసుర్లుగా కనిపించనున్నారు
ఈ సినిమా వచ్చే సంవత్సరం జనవరి 26న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం శుక్రవారం ప్రకటించింది
ఈ సందర్భంగా వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ – ‘‘రిపబ్లిక్ డే కానుకగా ‘హంట్’ సినిమాను జనవరి 26న థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం అంటూ వెల్లడించారు
మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన పలు చిత్రాలకు పని చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్స్ రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియార్ ‘హంట్’ చిత్రానికి యాక్షన్ స్టంట్స్ కొరియోగ్రఫెర్స్ గా పని చేశారు
వాళ్లు డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ ఓ హైలైట్‌గా నిలుస్తుంది’’ అని వి. ఆనంద ప్రసాద్ అన్నారు
చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి అని చిత్ర యూనిట్ వెల్లడించింది