తాజాగా యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.

మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు చిత్రయూనిట్.

ఇందులో భాగంగా సుధీర్ బాబు మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన బ్రహ్మాస్త్ర సినిమాలో తనకు ఛాన్స్ వచ్చిందని తెలిపారు.

రణబీర్ కపూర్, అలియా భట్ కలిసి నటించనిన బ్రహ్మాస్త్ర సినిమా ఇటీవల విడుదలై మంచి హిట్ అందుకుంది.

అయితే అప్పటికే కమిట్ అయిన సినిమాలతో బిజీగా ఉండటంతో.. ఆ సినిమా ఛాన్స్‌ను సున్నితంగా తిరస్కరించారట సుధీర్ బాబు.

అయితే బ్రహ్మాస్త్ర సినిమాలో ఏ పాత్రలో ఛాన్స్ వచ్చిందన్నది మాత్రం చెప్పలేదు సుధీర్ బాబు.

తాను ఇతర ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటం వల్లే బ్రహ్మాస్త్ర సినిమాలో నటించలేకపోయానని, మారే ఇతర కారణాలు లేవని సుధీర్ బాబు క్లారిటీ  ఇచ్చారు.