ఎప్పుడు సిక్సపెక్ తో ఫిట్‌గా కనిపించే సుధీర్‌బాబు ఇలా మారిపోయాడేంటని ఆశ్చర్యపోతున్నారా

‘మామా మశ్చీంద్ర’ చిత్రం కోసం సుధీర్‌ ఇలా మారాడు

నటుడు, రచయిత హర్షవర్ధన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధీర్‌బాబు ట్రిపుల్ రోల్ లో సందడి చేయబోతున్నాడు

ఓ పాత్రలో బొద్దుగా కనిపించే యువకుడిగా నటించారు

శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్ పై సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది

ఈ మూవీలో సుధీర్‌బాబు దుర్గ, పరశురామ్‌, డీజే అనే మూడు పాత్రల్లో కనిపించనున్నారు

బుధవారం దుర్గ పాత్ర లుక్‌ని విడుదల చేశారు మూవీ మేకర్స్

ఈ నెల 4న పరశురామ్‌ లుక్‌నీ, 7న డీజే లుక్‌నీ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది