బాగా చదవాలనే ఆసక్తి, కోరిక, కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన ఖచ్చితంగా ఉండాలి

పాసైతే చాలు అనుకోకుండా.. ఫస్ట్‌ ర్యాంక్‌ రావాలనే తపనతో చదవాలి

చదవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తే.. ఇతర వ్యాపకాలు వాటంతట అవే దూరం అవుతాయి

ఏకాగ్రతకు భంగం కలిగించే వాటిని దూరంగా పెట్టాలి

నిరంతరం ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తితో చదివితే మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది

ఒకవేళ తక్కువ మార్కులు వస్తే నిరాశ చెందకూడదు. ఇవన్నీ చదువులో భాగమేననే భావించాలి

ఆశించిన మార్కులు వచ్చేంతవరకు ఆ ప్రయత్నాలను ఆపకూడదు

కఠినంగా అనిపించిన అంశాలకు ఎక్కువ సమయాన్ని కేటాయించి చదవాలి