‘స్త్రీ’ లాంటి హిట్ చిత్రం తర్వాత రాజ్‌కుమార్‌ రావ్‌, శ్రద్ధా కపూర్‌ మళ్లీ జంటగా కనిపించనున్నారు.

ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘స్త్రీ 2’ విడుదల ఖరారైంది.

ఈ చిత్రాన్ని 2024 ఆగస్టు 31న విడుదల చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం.

ఓ ఊళ్లో మగాళ్లను ఎత్తుకుపోయే దెయ్యం బారిన పడకుండా ఉండాలని గోడలపై ఓ స్త్రీ రేపు రా అని రాస్తారు.

అలాంటి దెయ్యంతో ప్రేమలో పడిన ఓ వ్యక్తి ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటాడో అన్నది ‘స్త్రీ’ చిత్రంలో చూపించారు.

అమర్‌ కౌశిక్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దినేష్‌ విజన్‌ నిర్మించారు.

మొదటి భాగంలో నటించిన అపరశక్తి ఖురానా, అభిషేక్‌ బెనర్జీ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

మరి ‘స్త్రీ 2’ చిత్రంలో ఎలాంటి మలుపులుంటాయో తెలియాలంటే వేచి ఉండవలసిందే.