చలికాలంలో చాలామంది గ్యాస్, అసిడిటీ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటుంటారు.

ఈ సమస్య వెనుక చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. అవేంటో తెలుసుకోండి.

చలికాలంలో జంక్ ఫుడ్, నూనె పదార్థాలు తినేవారికి పొట్ట సమస్యలు వస్తాయి.

చలికాలంలో తగిన మోతాదులో నీరు తాగకపోవడం వల్ల గ్యాస్ సమస్య వస్తుంది.

డీహైడ్రేషన్ సమస్య పెరిగి శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతాయి. దీనివల్ల గ్యాస్ అసిడిటీ సమస్య వస్తుంది.

చలికాలంలో కాఫీ లేదా టీని ఎక్కువగా తాగితే గ్యాస్ సమస్య వస్తుంది.

అందుకే సాధ్యమైనంత వరకు వీటికి దూరంగా ఉండాలని పేర్కొంటున్నారు.