సినీ పరిశ్రమ అనేది నిజంగా ఒక మాయా ప్రపంచం. అందులో బ్యాక్‌గ్రౌండ్ లేకుండా హీరోగా ఎదగడమంటే చాలా కష్టమే.

ఆ క్రమంలోనే హీరో అవుదామనుకుని వచ్చి దర్శకులు, విలన్లు అయినవారు.. విలన్‌ నుంచి హీరోగా మారినవారు చాలా మందే ఉన్నారు.

మరి అలా దర్శకుడిగా సెటిల్ అవ్వాలనుకుని సినీ ఇండస్ట్రీకి వచ్చి హీరో అయిన నటులు ఎవరో మనం ఇప్పుడు చూద్దాం..

             సిద్ధార్థ్ ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్ ఉన్న సిద్ధార్థ్ కూడా తన కెరీర్‌ను అసిస్టెంట్ డైరెక్టర్‌గానే మొదలుపెట్టాడు.

                రాజ్ త‌రుణ్ యంగ్ హీరో రాజ్ త‌రుణ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినీ ఇండస్ట్రీకి వచ్చి, ఉయ్యాల జంపాల మూవీతో హీరో ఛాన్స్ అందుకున్నాడు.

                 నిఖిల్ శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ మూవీతో ప‌రిచ‌యమైన నిఖిల్ కూడా అసిస్టెంట్ డైరెక్టర్‌గానే కెరీర్ స్టార్ట్ చేసాడు.

       న్యాచురల్ స్టార్ నాని అష్టాచెమ్మా సినిమాలో హీరోగా తెరంగేట్రం చేసిన న్యాచురల్ స్టార్ నాని కూడా అసిస్టెంట్ డైరెక్టర్‌గానే కెరీర్‌ను ప్రారంభించాడు.

      మాస్ మ‌హారాజ ర‌వితేజ సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ వేస్తూ మాస్ మహారాజగా ఎదిగిన రవితేజ కూడా అసిస్టెంట్ డైరెక్టర్‌గా త‌న సినీ జీవితాన్ని మొదలుపెట్టాడు.