విలన్‌ నుంచి స్టార్ హీరోగా ఎదిగిన వారిలో మెగాస్టార్ చిరంజీవి, రవితేజ వంటివారు చాలా మందే ఉన్నారు.

 అయితే ఇటీవలి కాలంలో కొందరు స్టార్ హీరో ఇమెజ్ తెచ్చుకుని విలన్ అవతారం ఎత్తుతున్నారు.

 మరి 2022లో విలక్షణంగా విలన్ పాత్రలో కనిపించిన స్టార్ హీరోలెవరో ఇప్పుడు చూద్దాం..

హీరోగా మంచి పేరు తెచ్చుకున్న సత్యదేవ్, 2022లో విడుదలైన చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’లో విలన్‌గా నటించారు.

హీరోగా అభిమానులను మెప్పించిన ఆదిపినిశెట్టి ‘ది వారియర్’ సినిమాలో విలన్‌గా చేశారు.

విలక్షణ హీరో రానా దగ్గుబాటి కూడా పవన్ కళ్యాన్ ‘బీమ్లా నాయక్’ సినిమాలో విలన్‌ పాత్రను పోషించారు.

మలయాళం స్టార్ హీరో  ఫహద్ ఫాజిల్ కూడా అల్లు అర్జున్ ‘పుష్ప: ది రైజ్’ సినిమాలో విలన్‌గా చేశారు.

తమిళ్ స్టార్ హీరో అజిత్ కూడా వలిమై సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించారు.

సూర్య కూడా కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమాలో విలన్ పాత్రలో కనిపించి అభిమానులను మెప్పించారు.

అదే సినిమాలో విజయ్ సేతుపతి కూడా ప్రతినాయకుడిగా నటించారు.

కేజీయఫ్:2 లో అధిరాగా కనిపించిన సంజయ్ దత్ కూడా విలన్‌గా మెప్పించారు.