నిన్న మొన్నటి వరకు టాలీవుడ్, బాలీవుడ్ లకే పరిమితమైన పాన్ ఇండియన్ డైరెక్టర్ రాజమౌళి.. ఇప్పుడు ఇంటర్నేషన్ రేంజ్లో బజ్ చేస్తున్నారు.
అక్కడి డైరెక్టర్స్‌ను కలుస్తూ.. అక్కడి ఆడియెన్స్‌తో ఇంటరాక్ట్ అవుతూ.. ప్రెస్ మీట్లతో మీడియాను అడ్రస్ చేస్తూ.. తన క్రేజ్‌ను ఇండియా బయట విపరీతంగా పెంచేసుకుంటున్నారు.
ఇక తాజాగా ఓ అరుదైన గౌరవాన్ని కూడా అందుకుని అటు నేషనల్ ఇటు ఇంటర్నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు.
ఇక ఇప్పటికే ట్రిపుల్ ఆర్ సినిమాతో హాలీవుడ్ డైరెక్టర్లను కూడా ఫిదా చేసిన రాజమౌళి.. సాటర్న అవార్డులలోనే తన సత్తా చాటారు.
ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ట్రిపుల్ ఆర్ ఎంపికవడంతో.. అక్కడ ఓవర్ నైట్ సెంట్రాఫ్ అట్రాక్షన్ గా మారిపోయారు.
ఇక ఈ క్రమంలోనే లాస్ ఎంజిల్స్‌లో జరిగిన.. గవర్నర్స్ అవార్డులకు చీఫ్ గెస్ట్ గా వెళ్లారు రాజమౌళి.తను ఎప్పుడూ కనిపించే లుక్‌కు కాస్త డిఫరెంట్గా.. బ్లాక్ అండ్ వైట్ సూట్ లో కాస్త క్లాసీగా.. హాలీవుడ్ మేకర్లా రెడీ అయ్యారు.
ఇక ఈ వీడియోను.. రాజమౌళి సన్ కార్తికేయ తన ఇన్‌స్టాలో షేర్ చేయడంతో.. ఇప్పుడు నెట్టింట కూడా విపరీతంగా వైరల్ అవుతున్నారు మన జక్కన్న.