తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హీరోయిన్ గా నటిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు శృతి హాసన్.

ఇటీవల సోషల్ మీడియాలోనూ ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటోంది ఈ భామ.

ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలైన మెగాస్టార్ వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డిలో కథానాయకిగా చేసిన విషయం తెలిసిందే.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గున్న  శృతిహాసన్ వాల్తేరు వీరయ్య సాంగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

శృతిహాసన్ మాట్లాడుతూ..'మంచులో డ్యాన్స్ చేయడం అంటే చాలా కష్టం. హీరోలు మాత్రం చలిని తట్టుకునేలా జాకెట్స్ వేసుకుంటారు.

కానీ మాకు  అలాంటివేమీ ఇవ్వరు. కనీసం కోట్, శాలువా కూడా ఇవ్వరు. మేము కేవలం శారీ, జాకెట్ ధరించి ఆ గడ్డ కట్టిన మంచులో డ్యాన్స్ చేయాలి.

దయచేసి హీరోయిన్ల విషయంలో ఇలాంటివి ఆపాలని కోరుకుంటున్నా. ఎందుకంటే నాకు ఇటీవలే ఇలాంటి అనుభవం ఎదురైంది' అని తెలిపారు.

కాగా.. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మూవీలో ఓ సాంగ్‌ను పూర్తిగా మంచుకొండల్లో షూట్ చేసిన సంగతి తెలిసిందే.