2016లో నిర్మల కాన్వెంట్ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు రోషన్

మళ్ళి 5 ఏళ్ళ తర్వాత 2021లో పెళ్లి సందడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు

ఈరోజు  రోషన్‌ పుట్టినరోజు సందర్భంగా ఓ కొత్త కబురు చెప్పారు

ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌లో ఒక సినిమా చేసే ఓ క్రేజీ ఆఫర్ అందుకున్నారు

ఈ ప్రాజెక్ట్‌లో వేదాంస్‌ పిక్చర్స్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ కూడా భాగస్వామిగా ఉండనుంది

‘అద్వైతం’ షార్ట్ ఫిల్మ్ తో జాతీయ అవార్డు అందుకున్న ప్రదీప్‌ అద్వైతం ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం

యాక్షన్‌ పీరియాడిక్‌ డ్రామాగా ఈ సినిమా రూపొందనున్నట్లు సమాచారం

ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయనున్నారు