అతిలోక సుందరి శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయి సుమారు నాలుగేళ్లు గడిచిపోయాయి. అయినా ఆమె జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి.
టీవీల్లో ఆమె సినిమాలు వచ్చినప్పుడల్లా ఆమెను గుర్తుచేసుకుంటున్నారు ఫ్యాన్స్. తనదైన అందం, నటనతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుందామె.
నిర్మాత బోనీకపూర్‌తో పెళ్లయ్యాక 1997లో నటనకు కాస్త విరామం చెప్పారు. ఆ తర్వాత 2012లో ఇంగ్లిష్-వింగ్లిష్ చిత్రంతో మళ్లీ సిల్వర్ స్ర్కీన్‌పై దర్శనమిచ్చింది.
శ్రీదేవికి గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తికానున్నాయి. ఈనేపథ్యంలో అతిలోక సుందరికి ఘనంగా నివాళి అర్పించేందుకు సిద్ధమవుతోంది ఆ చిత్రబృందం.
ఈ మూవీ 10వ వార్షికోత్సవం నిర్వహించడంతోపాటు, ఇంగ్లిష్ వింగ్లిష్ సినిమాలో శ్రీదేవి ధరించిన చీరలను వేలం వేయాలని అనుకుంటున్నట్టు గౌరీ తెలిసింది.
వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని బాలికల విద్య కోసం పనిచేసే ఓ స్వచ్ఛంద సంస్థకు విరాళం ఇవ్వనున్నట్లు పేర్కొంది. అయితే ఆమె చీరలను ఎక్కడ వేలం వేయనున్నారు..?
ఎలా కొనుగోలు చేయాలన్న విషయాలను త్వరలోనే తెలుపుతామని గౌరీ తెలిపింది.
ప్రస్తుతం శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ తల్లి వారసత్వాన్ని నిలబెట్టడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తోంది.