దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన చిత్రం పెళ్లి సందD.

ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రీలీల ఒకే సినిమాతో మంచి పాపులారిటీని తెచ్చుకున్నారు.

శ్రీలీల తాజాగా రవితేజ సరసన ధమాకాలో నటించారు. ఆ చిత్రం కూడా బ్లాక్ బ‌స్టర్ అయ్యింది.

అందం తో పాటు అభినయం, డాన్స్ లో కూడా అదరగొడుతున్న శ్రీలీల కి టాలీవుడ్ లో అవకాశాలు క్యూ కడుతున్నాయి.

ప్రస్తుతం ఆమె చేతిలో 8 చిత్రాలున్నాయి. ప్రస్తుతం శ్రీలీల రామ్ పోతినేని, బోయపాటి చిత్ర షూటింగ్ లో పాల్గొంటుంది.

అలాగే వైష్ణవ్ తేజ్ తదుపరి చిత్రంలో.. అలాగే మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న SSMB28 లో ఒక హీరోయిన్‌గా నటిస్తోంది శ్రీలీల.

తన తొలి చిత్రానికి 5 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్న శ్రీలీల.. ధమాకా చిత్రానికి 50 లక్షలు తీసుకుంది.

ఇక ఆ సినిమా హిట్ కావడం తో తన రెమ్యూనరేషన్ ని 3 కోట్లకు పెంచినట్లు తెలుస్తోంది.