సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత ఒక సంవత్సరం చాలా మంది పరిచయం అవుతూ ఉంటారు.

కొంత మంది కొన్ని సినిమాలు చేసి ఆపేస్తే, మరి కొంత మంది మాత్రం వరుసగా సినిమాలు చేస్తూనే ఉంటారు.

వీరిలో కొంత మంది అయితే మొదటి సినిమాతోనే చాలా క్రేజ్ సంపాదించుకొని, ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఉంటారు.

అలా మొదటి సినిమాతోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకొని, ఇప్పుడు బిజీగా ఉన్న నటి శ్రీలీల.

పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ఆ తర్వాత ధమాకా సినిమాతో హిట్ కొట్టారు.

ఇప్పుడు మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో మరియు మరికొన్ని సినిమాలో కూడా నటిస్తున్నారు.

అయితే అంతకుముందే శ్రీలీల ఒక తెలుగు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఆ సినిమానే చిత్రాంగద.

కొన్ని సంవత్సరాల క్రితం అంజలి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శ్రీలీల ఒక చిన్న పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపిస్తారు

హీరోయిన్ సింధూ తులాని ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించారు. సింధూ తులాని చిన్నప్పటి పాత్రలో శ్రీలీల నటించారు.

అలా శ్రీలీల చాలా సంవత్సరాల క్రితమే తెలుగు సినిమాలో నటించారు. ఇంక శ్రీలీల ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.