ఉల్లిపాయ మొలకలను ఉల్లికాడలు అని అంటారు. వీటికే స్ప్రింగ్ ఓనియన్స్ అని కూడా పేరు.
ఉల్లిపాయల్ని వాడలేని వారికి తక్కువ ఘాటుతో, మంచి రుచితో ఉండే ఉల్లికాడలు సరైన ప్రత్యామ్నాయం.
ఈ స్ప్రింగ్ ఓనియన్స్‌ను కూరలు, సలాడ్స్, సూప్స్, బిర్యానీ వంటి పలు ఆహారాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
ఉల్లికాడల్లో పీచు పదార్ధం ఎక్కువ. తరచుగా తినేవారిలో బరువు సమస్య ఏర్పడదు.
ఇంకా మలబద్ధక సమస్య కూడా ఉండదు. ఉల్లి కాడల్లో ఉన్న డైటరీ ఫైబర్ ఆకలిని అదుపులో ఉంచుతుంది.
ఉల్లికాడల్లోనే సల్ఫర్ అధికం. దీంతో తరచుగా తినే ఆహారంలో చేర్చుకుంటే కొలెస్ట్రాల్‌ను, హైబీపీని అదుపులో ఉంటాయి.
జలుబు, దగ్గుతో ఇబ్బంది పడేవారికి ఉల్లికాడల సూప్ దివ్య ఔషధం. ఉల్లికాడల సూప్ తాగితే దగ్గు జలుబు నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది.