‘ఆ రోజు షూటింగ్ వదిలి.. విదేశాలకు వెళ్లిపోవాలనుకున్నా..’ మను బాకర్
30 July 2024
TV9 Telugu
TV9 Telugu
ప్రపంచంలో అతిపెద్ద క్రీడా ఈవెంట్ ప్యారిస్ ఒలింపిక్స్ ప్రపంచ క్రీడా వేదికపై సత్తాచాటి సంచలన ప్రదర్శన ఇచ్చిన యువ క్రీడాకారిణి మను బాకర్.. 124 ఏళ్ల రికార్డును తిరగరాస్తూ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, మిక్స్‌డ్ టీమ్ విభాగాల్లో రెండు పతకాలను భారత్‌కు అందించింది
TV9 Telugu
మొన్న వ్యక్తిగత విభాగంలో కాంస్య సాధించిన మను.. ఈ రోజు (జులై 30) మిక్స్‌డ్ టీమ్ విభాగంలో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి భారత్‌కు మరో కాంస్య పతకాన్ని అందించింది
TV9 Telugu
స్వాతంత్ర్య భారత్‌లో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన భారత అథ్లెట్‌గా ఆమె రికార్డు సృష్టించింది. కేవలం 2 రోజుల వ్యవధిలో రెండు పతకాలు సాధించిన మను ఒక దశలో షూటింగ్‌ను వదిలేద్దామనుకుందట. 2023 వరకు అదే ఆలోచనలో ఉందట
TV9 Telugu
తొలి కాంస్యం గెలిచిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. 'ఆ రోజు నా జీవితంలో టర్నింగ్ పాయింట్. 2023లో ఒకరోజు కోచ్ నాతో మాట్లాడుతూ.. జీవితంలో ఏం చేద్దామనుకుంటున్నావని అడిగారు
TV9 Telugu
వెంటనే తెలియదని సమాధానం ఇచ్చాను. ఒకట్రెండు సంవత్సరాల్లో షూటింగ్‌ను వదిలేసి పై చదువుల కోసం విదేశాలకు వెళ్లొచ్చని అన్నాను. దానికి కోచ్ నుంచి వచ్చిన స్పందన ఎంతగానో మోటివేట్ చేసిందని మనూ చెప్పుకొచ్చింది
TV9 Telugu
'నవ్వు ప్రపంచస్థాయి బెస్ట్ షూటర్‌వని నమ్ముతున్నాను. ఆ తర్వాత నీ ఇష్టం. నిర్ణయం నీదే’ అని ఆ రోజు కోచ్ చెప్పిన మాటలు నాపై బలమైన ప్రభావం చూపాయని చెప్పిందట. నా స్థానంలో మీరుంటే ఏం చేస్తారు..?’ అని వెంటనే కోచ్‌ను ప్రశ్నించాను
TV9 Telugu
'ఒలింపిక్స్ పతకమా, ఇంకోటా అని చూడకుండా, వెనక్కి తిరిగి చూడటం మానేసి.. నా కల నెరవేరేవరకు ఈ స్థానంలో ఉండేందుకు నిర్విరామంగా శ్రమిస్తాను' అని కోచ్ బదులిచ్చారు
TV9 Telugu
ఆ మాటలు నన్నెంతో ఇన్‌స్పైర్ చేశాయి. అందుకే పతక పోరులో అసలు స్కోర్ గురించి పట్టించుకోలేదు. అసలు ఆ స్క్రీన్ వైపే చూడలేదు. వచ్చేది గోల్డ్ మెడలా లేకపోతే ఎలిమినేట్ అవుతానా..? ఏదైనా కానీ అంగీకరించాలి
TV9 Telugu
'నాకు వచ్చిన అవకాశం పట్ల కృతజ్ఞతతో ఉండాలని, ఆట ఆడుతున్నంతసేపు నా ఆలోచన ఇలాగే ఉండింది'అని మను చెప్పుకొచ్చింది. మను మాటలు నిజంగా స్ఫూర్తి దాయకం. ఎందుకంటే విజేతలెవ్వరూ గెలుపోటములను పట్టించుకోరు. పోరాటమే వారి అంతిమ లక్ష్యం