అర్జున అవార్డు ఎప్పుడు ప్రారంభించారు..?

24 December 2023

TV9 Telugu

క్రీడా రంగంలో అద్భుతమైన ప్రదర్శన కోసం అర్జున అవార్డు భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉత్తమ క్రీడాకారులకు అందజేస్తుంది.

ఈ అవార్డుతో పాటు రూ. 15,00, 000 నగదు బహుమతి అందజేస్తారు. ఇది కేవలం క్రీడాకారులకు మాత్రమే అందజేసే పురస్కారం.

గత 3 సంవత్సరాలుగా మంచి క్రీడా ప్రతిభతో పాటు మంచి క్రమశిక్షణ కలిగిన నడవడిక కలిగిన క్రీడాకారులను ఈ అవార్డు వరిస్తుంది.

అర్జునుడి కాంస్య విగ్రహంతో పాటు అవార్డు కింత ప్రశంసా పత్రం, నగదు బహుమతిని కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది.

భారతదేశంలో 1961లో తొలిసారిగా అర్జున అవార్డును మొదుపెట్టారు. అప్పుడు ఈ అవార్డును ఆరుగురు ఆటగాళ్లకు అందించారు.

అర్జున అవార్డు గెలుచుకున్న తొలి క్రికెటర్ సలీం దురానీ. అర్జున అవార్డు గెలుచుకున్న తొలి మహిళ స్టెఫీ డిసౌజా.

ఇప్పటి వరకు 12 మంది మహిళ క్రీడాకారిణులతో సహా 57 మంది క్రికెటర్లు ప్రభుత్వం ద్వారా అర్జున అవార్డును అందుకున్నారు.

2023 సంవత్సరానికి గానూ మహ్మద్ షమీ (క్రికెట్), అజయ్ రెడ్డి (అంధుల క్రికెట్), ఓజాస్ ప్రవీణ్ డియోటాలే, అదితి గోపీచంద్ స్వామి (అర్చరీ) సహా పలువురు ఆటగాళ్లు ఎంపికయ్యారు.