రంజీ మ్యాచుల్లో కింగ్ కోహ్లీ.. రోజుకు జీతం ఎంతో తెలుసా?
01 February 2025
Basha Shek
టీమిండియా స్టార్ క్రికెటర్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ దాదాపు 12ఏళ్ల తరువాత రంజీ ట్రోఫీ ఆడుతున్న సంగతి తెలిసిందే.
ఢిల్లీ, రైల్వేస్ మధ్య జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ బరిలోకి దిగాడు. దీంతో కింగ్ కోసం అభిమానులు పోటెత్తారు
అయితే రైల్వేస్ తో జరుగుతున్న రంజీ ట్రోఫీలో కింగ్ కోహ్లీ తక్కువ స్కోరుకు ఔటై మరోసారి అభిమానులను నిరాశపర్చాడు.
ఈ మ్యాచ్ లో 15 బంతులు ఎదురుకున్న విరాట్ కోహ్లీ.. కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి సంగ్వాన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
ఇక రెండో ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీకి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేకపోయింది. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరాశకు లోనయ్యారు.
చాలా రోజల తరువాత రంజీ మ్యాచ్ లు ఆడుతున్న కోహ్లీ ఎంత జీతం తీసుకుంటున్నాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
కొన్ని నివేదికల ప్రకారం రంజీ మ్యాచ్ కోసం విరాట్ కోహ్లీ రోజుకు 60 వేల రూపాయల జీతం అందుకోనున్నాడు.
అంటే మ్యాచ్ జరిగే నాలుగురోజులకు కలిపి మొత్తం రూ .2లక్షల 40 వేల పారితోషకాన్ని అందుకోనున్నాడు కింగ్ కోహ్లీ.
ఇక్కడ క్లిక్ చేయండి..