'నా త‌ప్పులను మన్నించండి’.. పవిత్ర హజ్ యాత్రకు సానియా మీర్జా

TV9 Telugu

09 June 2024

 టెన్నిస్ దిగ్గ‌జం సానియా మీర్జా ఈ మ‌ధ్య త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. షోయబ్ మాలిక్‌తో విడాకుల అనంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారిందామె.

ఎక్కువ సేపు తన కుమారుడితోనే గడుపుతోన్న ఆమె ఒంట‌రిత‌నాన్ని జ‌యించేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

ఇందులో భాగంగా సామాజిక మాధ్యమాల్లో ఇన్ స్పైరింగ్ పోస్టులు పెడుతూ తనకు తానే ధైర్యం చెప్పుకుంటోందీ టీమిండియా టెన్ని స్ దిగ్గజం.

 కాగా మ‌త‌ప‌రంగా ముస్లిం అయిన సానియా త్వ‌ర‌లోనే ప‌విత్ర‌మైన హ‌జ్ యాత్ర‌కు వెళ్ల‌నుంది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారాఅందరితో పంచుకుంది.

జీవిత‌కాలంలో ఒక్క‌సారైనా మ‌క్కాకు వెళ్లాల‌నుకున్న త‌న‌ క‌ల నిజ‌మ‌య్యే రోజు కోసం ఆతృత‌గా ఉన్న‌ట్టు సానియా త‌న తాజా సోషల్ మీడియా పోస్ట్‌లో వెల్ల‌డించింది

'ప్రియ‌మైన స్నేహితులు, స‌న్నిహితులు.. మీ అంద‌రికీ ఒక గుడ్ న్యూస్. ప‌విత్ర‌మైన హ‌జ్ యాత్ర చేసే అవ‌కాశం నాకు ల‌భించింది'

 ' ఈ పవిత్రమైన యాత్ర కోసం నేను సిద్ధ‌మ‌వుతున్నా. నేను ఏమైనా త‌ప్పులు చేసి ఉంటే పెద్ద మనసుతో మన్నించండి'

అల్లా నా పొర‌పాట్ల‌ను క్ష‌మించి.. ఈ ప్ర‌యాణంలో నాకు తోడుగా ఉంటాడ‌ని న‌మ్ముతున్నాను' అని ఎమోషనల్ గా రాసుకొచ్చింది సానియా