ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రూ.49లతో రీఛార్జ్ ప్లాన్

TV9 Telugu

25 March 2024

ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం అయ్యింది. ఈ సమయంలో అందరు ఎక్కడికి వెళ్లకుండా మొబైల్స్ లేదా టీవీలలో చూస్తుంటారు.

ఈ తరుణంలో ప్రముఖ టెలిఫోన్ నెట్వర్క్ జియో రూ.49లతో అదిరిపోయే ఓ కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది.

ఒక రోజు వ్యాలిడిటీతో ఈ జియో రీఛార్జ్ ప్లాన్ వర్క్ చేస్తుంది. ఈ ప్లాన్ ప్రకారం మొత్తం 25జీబీ డేటా లభిస్తుంది.

బేస్ యాక్టివ్ ప్లాన్ ఉన్నట్లైతే దీనిని రీఛార్జ్ చేసుకునే సదుపాయం కల్పించింది జియో. అన్ లిమిటెడ్ డేటా పేరుతో దీనిని లిస్ట్ చేశారు.

ఈ ప్లాన్ తీసుకున్న వినియోగదారులు 25జీబీ డేటాను వాడిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 64కేబీపీఎస్‌కు తగ్గించబడుతుంది.

దేశవ్యాప్తంగా ఉన్న జియో ప్రీపెయిడ్ సబ్‌స్క్రైబర్‌లందరికీ ఈ ప్లాన్ అందుబాటులో ఉందని తెలిపింది జియో నెట్వర్క్.

ఈ జియో రీఛార్జ్ ప్లాన్ ఒకేసారి ఎక్కువ మొత్తంలో డేటాను వినియోగించాలనుకునే వారిని లక్ష్యంగా చేసుకుంది.

ఇక ఎయిర్‌టెల్ ఒకరోజు వాలిడిటీతో రూ.49 డేటా ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌లో 20GB డేటా వస్తుంది. ఇది Jio ప్లాన్‌తో పోల్చినప్పుడు 5GB తక్కువ.