4,6, 4, 6, 6, 4.. సూపర్ ఓవర్లలో లోగాన్ వాన్ బీక్ ప్రపంచ రికార్డ్..

సూపర్ ఓవర్‌లో లోగాన్ వాన్ బీక్ 30 పరుగులు బాదేశాడు.

జాసన్ హోల్డర్ వేసిన తొలి బంతికి అతను ఫోర్ కొట్టాడు.

రెండో బంతిని సిక్సర్‌గా బాదాడు. మూడో బంతిని మళ్లీ బౌండరీకి తరలించాడు.

ఇక 4వ, 5వ బంతుల్లో రెండు సిక్స్‌లు కొట్టాడు. ఇక ఆ ఓవర్ చివరి బంతికి ఫోర్ కొట్టాడు.

దీంతో వెస్టిండీస్‌పై నెదర్లాండ్స్ ఉత్కంఠ విజయం సాధించింది.

ఇక సూపర్ ఓవర్‌లో అత్యధికంగా 30 పరుగులు చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది.

అలాగే, లోగాన్ వాన్ బీక్ క్రికెట్ చరిత్ర సృష్టించాడు.

సూపర్ ఓవర్ అన్ని బంతులు ఆడడమే కాకుండా రెండు వికెట్లు తీసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు.