మోస్ట్ హెటెడ్ క్రికెటర్స్ వీరే..

TV9 Telugu

11 June 2024

షాహిద్ అఫ్రిది గతంలో పాకిస్తాన్ ప్రతిభావంతులైన ఆటగాళ్ళలో ఒకరు. కానీ అతని స్వభావం, అస్థిరమైన ఆట వెలుగులోకి రావడంతో అతనికి హెటెర్స్ పెరిగారు.

రికీ పాంటింగ్ అసాధారణమైన బ్యాటింగ్ సామర్థ్యం ఉన్నప్పటికీ మైదానంలో వివాదాలు,ఆవేశపూరిత పోటీతత్వాం వల్ల విపరీతమైన విమర్శలను ఎదుర్కొన్నాడు.

విరాట్ కోహ్లీని తరచుగా ప్రత్యర్థి ఆటగాళ్ళు, అంపైర్లతో వివాదాలు పెట్టుకుంటున్న కారణంగా ఈయనకు విమర్శకులు పెరిగారు.

దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ హషీమ్ ఆమ్లా నీరసమైన బ్యాటింగ్ శైలి ఉత్కంఠభరితమైన ఆటను కోరుకునే ప్రేక్షకులను చికాకు పెట్టడం వల్ల తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ కెవిన్ పీటర్సన్ తన యొక్క దూకుడు స్వభావం, సహోద్యోగులతో విభేదాలు హెటెర్స్ పెరగడానికి కారణం అయింది.

పాకిస్థాన్‌ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ సల్మాన్ బట్ బహిరంగంగా మ్యాచ్ ఫిక్సింగ్ వివాదాల్లో పాల్గొనడం ద్వారా అత్యల్ప స్థాయికి దిగజారాడు.

వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ మార్లోన్ శామ్యూల్స్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు తక్కువ ఇష్టపడే ఆటగాళ్ళలో ఒకరిగా చేసింది.

ఎస్ శ్రీశాంత్ భారత్‌కు మంచి బౌలర్‌. అయితే 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో అతని పాత్ర క్రికెట్ కెరీర్‌కు నష్టం కలిగించింది.

MS ధోని గంగూలీ, ద్రావిడ్, లక్ష్మణ్ రిటైర్మెంట్‌తో పాటు సెహ్వాగ్, గంభీర్, యువరాజ్, హర్భజన్‌లను జట్టు నుంచి తప్పించడానికి కారణమని కొందరు భావిస్తున్నారు.