ఒకే ఒలింపిక్స్‌లో 2 పతకాలు.. చరిత్ర సృష్టించిన భారత అమ్మాయి

TV9 Telugu

30 July 2024

పారిస్ ఒలింపిక్స్‌లో మను భాకర్ చరిత్ర సృష్టించింది. ఆమె పిస్టల్ నుంచి పేల్చిన బుల్లెట్ భారత్‌కు మరో పతకం సాధించడంలో సహాయపడింది. 

పారిస్ ఒలింపిక్స్ 2024

దీంతో భారత్ పతకాల సంఖ్య 2కి పెరిగింది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా కూడా మను భాకర్ నిలిచింది. 

రెండు పతకాలు

మను భాకర్ తన భాగస్వామి సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి భారత్‌కు రెండో పతకాన్ని అందించింది. 

భారత్‌కు రెండో పతకం

10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ కాంస్య పతక పోరులో మను-సరబ్‌జోత్ 16-10తో కొరియా జోడీని ఓడించారు.

కాంస్య పతకం

జులై 28న పారిస్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ సింగిల్స్ ఈవెంట్‌లో మను భాకర్ కాంస్య పతకాన్ని అందుకుంది.

10 మీటర్ల ఎయిర్ పిస్టల్

పారిస్‌లో సాధించిన తొలి కాంస్యంతో మను పతకాల పట్టికలో భారత్‌ ఖాతా తెరిచింది. 

48 గంటల తర్వాత

పారిస్‌లో తొలి విజయం సాధించిన 48 గంటల తర్వాత ఇప్పుడు మను భాకర్ మరో కాంస్యం సాధించి చరిత్ర సృష్టించింది.

చరిత్ర

జులై 29న జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ కాంస్య పతక మ్యాచ్‌కు మను భాకర్, సరబ్జోత్ సింగ్ అర్హత సాధించారు. 

10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్