టీవీ9 నక్షత్ర సమ్మాన్ అవార్డులు అందుకున్న క్రీడా రత్నాలు వీరే
25 Febraury 2024
దేశంలోనే నంబర్ వన్ న్యూస్ నెట్‌వర్క్ Tv9 'వాట్ ఇండియా థింక్స్ టుడే' రెండో ఎడిషన్ ఆదివారం (ఫిబ్రవరి 25) ప్రారంభమైంది.
మూడు రోజుల పాటు ఈ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఈ సందర్భంగా పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఇందులో భాగమయ్యారు.
మొదటి రోజున వివిధ రంగాల్లో తమ ప్రతిభా పాటవాలు చాటుకన్న పలువురి ప్రముఖులకు నక్షత్ర సమ్మాన్ అవార్డులు అందజేశారు.
20 ఏళ్ల బ్యాడ్మింటన్ ప్లేయర్ అన్మోల్ ఖర్బ్‌కు పుల్లెల గోపీచంద్ నక్షత్ర సమ్మాన్‌ను అందించారు. ఆసియా ఛాంపియన్‌షిప్ గెలిచిన భారత మహిళల జట్టులో అన్మోల్ సభ్యురాలు
ఆసియా క్రీడల్లో భారత్‌కు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన అథ్లెట్ హర్మిలన్ బెయిన్స్‌కు కూడా ఈ ప్రత్యేక ఈవెంట్‌లో నక్షత్ర సమ్మాన్ లభించింది.
జమ్మూ కాశ్మీర్ పారా క్రికెట్ జట్టు కెప్టెన్ అమీర్ హుస్సేన్ లోన్ కూడా నక్షత్ర సమ్మాన్ అవార్డును అందుకున్నాడు. మెడలో బ్యాట్ పట్టుకుని క్రికెట్ ఆడే అమీర్ ఎందరో ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలిచాడు
ఆసియా క్రీడల్లో 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ లో బంగారు పతకం సాధించిన షూటర్ సిఫత్ కౌర్ సమ్రా కూడా నక్షత్ర అవార్డును అందుకుంది
వీరితో పాటు రవీనా టాండన్ లాంటి సినీ ప్రముఖులకు కూడా నక్షత్ర సమ్మాన్ అవార్డులు అందజేశారు.