వినాయక చవితికి ఏ రాశివారు ఎలాంటి దానం చేయాలంటే.? 

25 August 2025

Prudvi Battula 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేష రాశికి చెందిన వ్యక్తులు వినాయక చవితికి ఎరుపు రంగు దుస్తులను దానం చేయాలి.

మేషరాశి

వృషభ రాశి వారు వినాయక చవితి రోజున తెల్లటి రంగు దుస్తులను దానం చేయాలి. ఇలా చేయడం శుభప్రదంగా భావిస్తారు.

వృషభ రాశి

మిథున రాశి వారు వినాయక చవితి రోజున తులసి మొక్కను దానం చేయడం చాలా శుభప్రదం. ఇది వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది.

మిథున రాశి

కర్కాటక రాశికి చెందిన వ్యక్తులు వినాయక చవితి రోజున బియ్యం, ఉప్పు, పంచదార దానం చేయాలి. ఇలా చేస్తే గణపతి అనుగ్రహం లభిస్తుంది.

కర్కాటక రాశి

వినాయక చవితి రోజున సింహ రాశికి చెందిన వ్యక్తులు గోధుమలు, తేనెను దానం చేయడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు.

సింహ రాశి

కన్య రాశి వారు వినాయక చవితి రోజున కుడుములు, ఉండ్రాళ్ళు, స్వీట్లు వంటి ఆహారాన్ని దానం చేయడం చాలా శుభప్రదం.

కన్య రాశి

తుల రాశికి చెందిన వ్యక్తులు బొజ్జ గణపయ్య పుట్టిన రోజైన వినాయక చవితికి మోదకాలు దానం చేస్తే గణనాథుని దీవెనలు లభిస్తాయి.

తుల రాశి

వృశ్చిక రాశి వారు వినాయక చవితి రోజున వేరుశెనగలు, గోధుమలు, తేనెను దానం చేస్తే ప్రయోజనం ఉంటుందని పెద్దల మాట.

వృశ్చికరాశి

వినాయక చవితి రోజున ధనుస్సు రాశికి చెందిన వ్యక్తులు జమ్మి మొక్కను గుడిలో దానం చేయడం వల్ల విశేష ఫలితం ఉంటుంది.

ధనుస్సు రాశి

వినాయక చవితికి  మకరరాశి వారు పేదలకు  అన్నదానం చేయండి. ఇలా చేయడం వల్ల ఆ గణపతి ఆశీస్సులు లభిస్తాయని అంటున్నారు పండితులు.

మకరరాశి

కుంభ రాశి వారు వినాయక చవితి రోజున ఎవరికైనా వినాయక విగ్రహాన్ని బహుమతిగా ఇవ్వడం శుభప్రదమని పురాణాలు చెబుతున్నాయి.

కుంభ రాశి

మీన రాశి వారు గణేష్ చతుర్థి రోజున పసుపు రంగు బట్టలు, అరటిపండ్లను దానం చేయాలి. దీనివల్ల ఇంట్లో సమస్యలు దూరం అవుతాయి.

మీనరాశి