ఇంటి ముందు దిష్టి కోసం గుమ్మడికాయను ఎందుకు కట్టాలి.?
ఇంటి ముందు గుమ్మడికాయ ఉండటం వలన ఇంట్లోకి వచ్చేటటువంటి నకారాత్మకశక్తిని అంటే నెగిటివ్ ఎనర్జీని అది రాకుండా అడ్డం పడుతుంది.
మన ఇంటి మీద చూపించేటటువంటి చెడు ప్రభావాన్ని అది లాక్కుంటుంది.
గుమ్మడికాయ ఇంటికి ఉంటే కాలభైరవుడు రక్షణగా ఉన్నట్లు గుర్తు.
ఇంటి ముందుకు వచ్చేటటువంటి దోషాలు అంటే నరఘోష, నరపీడ, నరదృష్టి, నరశావ నకారాత్మకశక్తిని అంతా..
ఒకవేళ మీరు తరచుగా బూడిద గుమ్మడికాయలు కడుతున్నప్పుడల్లా కొద్ది రోజులకే కుల్లిపోతున్నాయంటే..
మీ ఇంటి మీద ఎక్కువగా నరఘోష, నరద్రుష్టి, నరపీడ ఉందని గుర్తుంచుకోండి.
మీకు తగలవలసి నటువంటి ఆ దోషాన్ని ఆ గుమ్మడికాయ లాక్కొని చెడిపోతుందని గమనించాలి.
వెంటనే ఆ పాడైపోయి నటువంటి గుమ్మడికాయను పారేసి వేరొకగుమ్మడికాయని కట్టాలి.
ఇంట్లో అద్దెకు నివసిస్తున్న వారైనా కూడా ఇంటి ద్వారబంధానికి పైన గుమ్మడికాయను ఖచ్చితంగా కట్టుకోవాలి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి