ఆ రోజుల్లో నల్లని బట్టలు ధరిస్తే ప్రతికూల ప్రభావం..
02 June 2025
Prudvi Battula
సనాతన హిందూ ధర్మం ప్రపంచ సంస్కృతులలో కెల్లా ఎంతో విభిన్నమైనది. పాటించే ప్రతి విషయం ప్రకృతితో, నమ్మకాలతో ముడిపడి ఉంటాయి.
హిందువులు పూజలు, పెళ్లిళ్లు, కార్యక్రమాలు విషయంలోనే కాదు ఎప్పుడు ఈ రంగు బట్టల ధరించాలన్న విషయంలో కూడా శాస్త్రాలను నమ్ముతారు.
ఈ క్రమంలోనే సోమవారం, మంగళవారం నల్లని బట్టలు ధరించకూడదనే నమ్మకం ఉంది. అందుకు కారణం కూడా లేకపోలేదంటున్నారు పెద్దలు.
నలుపు, డీప్ డార్క్ కలర్ ప్రతికూల పరిస్థితులకు సంకేతంగా పరిగణించబడుతుంది. అందుకే పండుగ, శుభకార్యల్లో నల్లని దుస్తులు ధరించడం నిషేధంగా భావిస్తారు.
ముఖ్యంగా భూతనాధుడు శివుడికి అంకితం చేసిన సోమవారం నాడు అస్సలు నల్లని బట్టలు ధరించకూడదని చెబుతున్నారు హిందూ పెద్దలు.
అలాగే భూతప్రేతలు సైతం చేసిన బయపడి పారిపోయేలా చేసిన ఆంజనేయుడికి అంకితం అయిన మంగళవారం రోజుల్లో నలుపు బట్టలు మంచిది కాదు.
పైగా నలుపు రంగు చీకటి, మరణంతో ముడిపడి ఉంటుంది కాబట్టి, ఆయా రోజుల్లో ఈ రంగును ధరించకుండా ఉండటం మంచిదని చెబుతారు.
కావాలంటే శివుడికి ఇష్టమైన ముదురు నీలం, హనుమంతుడికి ప్రీతిపాత్రమైన సింధూరం రంగు బట్టలను ధరించవచ్చని పండితులు చెబుతున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
మీరు తాగే టీ రకం బట్టి మీరు ఎలాంటి వారో తెలిసిపోతుంది.!
ఈ ఫాక్ట్స్ తెలిస్తే అవాక్ అవుతారు.!
ఇంట్లో వీటిని ఉంచుతున్నారా.? అశుభం అంటున్న పండితులు..