విదుర నీతి.. ఒంటరిగా ఉన్నప్పుడు అస్సలే ఈ పనులు చేయకండి!

Samatha

9 June 2026

మహాత్మ విదురుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మహాభారతంలో ఈయనది కీలక పాత్ర.

మహాత్మ విదురుడు

విదురుడు ఎన్నో గొప్ప నీతి వ్యాఖ్యలను చెప్పడం జరిగింది. కౌరవులకు సలహాలు సూచనలు ఇస్తూ ఉండేవాడు.

గొప్ప వ్యాఖ్యలను

ముఖ్యంగా ధృతరాష్ట్రడికి జీవితంలో ఉపయోగపడే ఎన్నో మంచి విషయాలను ఆయన బోధించారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు చేయకూడని పనులను తెలియజేశారు.

మంచి విషయాలు బోధించడం

విదుర నీతి ప్రకారం ఒక వ్యక్తి ఒంటరిగా రుచికరమైన ఆహారాలను తినకూడదంట. దీని వలన ఏదో తెలియని సమస్య వారిని వెంటాడుతుందంట.

రుచికరమైన భోజనం చేయడం

అంతే కాకుండా ఒంటరిగా తినే అలవాటు వారిలో స్వార్థాన్ని పెంచుతుంది, అది ఇతరులలో మీ పై ఉన్న అభిప్రాయాన్ని మార్చుతుందని చెబుతున్నాడు విదురుడు.

స్వార్థం పెంచడం

అదే విధంగా కుటుంబసభ్యులు అందరూ పడుకున్న సమయంలో ఒంటరిగా మీరు ఒక్కరే మేల్కోకూడదంట. ఇది మానసిక ఒత్తిడిని పెంచుతుంది.

ఒంటరిగా మేల్కొనడం

అంతే కాకుండా కొంత మంది ఒంటరిగా ప్రయాణాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. కానీ ఎప్పుడూ కూడా ఒంటరిగా ప్రయాణాలు చేయకూడదంట.

ఒంటరి ప్రయాణం

అలాగే కొందరు ఒంటరిగా నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఎప్పుడైనా సరే కీలక నిర్ణయాలను ఒంటరిగా తీసుకోవడం మంచిది కాదని విదురుడు తెలియజేస్తున్నాడు.

ఒంటరి నిర్ణయాలు