దేశంలో అత్యంత ఎత్తైన 10 ఆలయ గోపురాలు ఇవే..
TV9 Telugu
14 March 2025
శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం: 239 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం శ్రీరంగంలో మహావిష్ణువుకు అంకితం చేయబడింది.
మురుడేశ్వర్ ఆలయం, కర్ణాటక: భారతదేశంలో రెండవ ఎత్తైన శివ విగ్రహానికి నిలయం, 237 అడుగులు ఎత్తున్న ఈ ఆలయం తీరప్రాంత దృశ్యాలు ఆకర్షిస్తాయి.
జగన్నాథ ఆలయం, పూరి: చార్ ధామ్ ప్రదేశాలలో ఒకటి, ప్రత్యేకమైన రథయాత్రకు ప్రసిద్ధి చెందింది. ఈ టెంపుల్ ఎత్తు 214 అడుగులు.
బృహదీశ్వర ఆలయం, తంజావూరు: 11వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయం ఎత్తు 212 అడుగులు. అద్భుతమైన ద్రావిడ నిర్మాణ శైలిని ప్రదర్శిస్తుంది.
అన్నామలైయార్ ఆలయం, తిరువణ్ణామలై: కార్తిగై దీపానికి ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం శివుని రూపానికి అంకితం చేయబడింది. 217 అడుగులు ఎత్తు ఉంటుంది.
ఏకాంబరేశ్వర ఆలయం, కాంచీపుర: ఏకాంబరేశ్వర దేవాలయం ఎత్తు 194 అడుగులు. ఇది భూమికి అంకితం చేయబడిన పంచ భూత స్థలం.
లింగరాజ ఆలయం, భువనేశ్వర్: కళింగ నిర్మాణ శైలికి అద్భుతమైన ఉదాహరణ అయిన లింగరాజ దేవాలయం ఎత్తు 180 అడుగుల.
విఠల్ రుక్మిణి ఆలయం, పంధర్‌పూర్: ఆషాధి ఏకాదశి పండుగ సందర్భంగా 180 అడుగుల విఠల్ రుక్మిణి ఆలయని లక్షలాది మంది భక్తులు వెళ్తారు.
మీనాక్షి ఆలయం, మధురై: 14 రంగుల గోపురాలతో తమిళ సంస్కృతిని ప్రదర్శించే 170 అడుగుల మీనాక్షి ఆలయాన్ని ఒక్కసారైన దర్శించాలి.
రాజగోపాలస్వామి ఆలయం, మన్నార్గుడి: ఈ గొప్ప విష్ణు ఆలయం అద్భుతమైన శిల్పాలు మరియు ఎత్తైన గోపురం కలిగి ఉంది. దీని ఎత్తు 154 అడుగులు.
మరిన్ని వెబ్ స్టోరీస్
వేసవిలో ఈ మంచు ప్రాంతాలు భూతల స్వర్గం.. ఒక్కసారైన చూడాలి..
ఎలాంటి ఖర్చు లేకుండా ఫ్రీగా 100కుపైగా టీవీ ఛానెల్లు
ప్రపంచంలోని సొంత సైన్యం లేని దేశాలు ఇవే..!