చార్ ధామ్ యాత్రలో తప్పక చూడాల్సిన 8 ప్రదేశాలు ఇవే..
21 May 2025
Prudvi Battula
పవిత్ర నగరాల్లో ఒకటైన హరిద్వార్‌లో చార్ ధామ్ ప్రారంభమవుతుంది. ఇక్కడ గంగా నది ఒడ్డున సాయంత్రం గంగా హారతి ప్రసిద్ధి.
రిషికేశ్ ఆధ్యాత్మిక ప్రశాంతతను, సుందరమైన అందాన్ని అందిస్తుంది. మీకు సమయం ఉంటే ఇక్కడ కూడా గంగా హారతిని చుడండి.
యమునోత్రికి వెళ్ళేటప్పుడు బార్కోట్ అనే చిన్న పట్టణం గుండా వెళతారు. ట్రెక్కింగ్ ప్రారంభమయ్యే ముందు విశ్రాంతి తీసుకోవడానికి ఒక ప్రశాంతమైన స్థావరం.
గంగోత్రి చేరుకునే ముందు భాగీరథి నది ఒడ్డున అందమైన గ్రామం హర్సిల్‌లో ఆగండి. చుట్టూ పైన్ అడవులు, మంచుతో కప్పబడిన శిఖరాలతో అందంగా ఉంటుంది.
ఉత్తరకాశి ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక పట్టణం. గంగోత్రికి వెళ్ళే మార్గంలో ఒక సాధారణ స్టాప్ ఓవర్. ఇది శివుడికి అంకితం చేయబడిన ప్రసిద్ధ కాశీ విశ్వనాథ ఆలయం ఉంది.
కేదార్‌నాథ్ ట్రెక్కింగ్ ప్రారంభించే ముందు చాలా మంది యాత్రికులు గుప్త్ కాశిలో ఆగుతారు. ఆ పేరుకు అర్థం దాచబడిన కాశీ. ఈ పట్టణం శివ ఇతిహాసాలతో ముడిపడి ఉంది.
జోషిమఠ్ గొప్ప మతపరమైన ప్రాముఖ్యత కలిగిన పట్టణం. ఆది శంకరాచార్యలు ఇక్కడే ఆధ్యాత్మిక కేంద్రాన్ని స్థాపించారు.
బద్రీనాథ్ వెళ్ళే మార్గంలో మీరు దేవప్రయాగ్‌ను చూస్తారు. అక్కడ అలకనంద, భాగీరథి నదులు గంగానదిని ఏర్పరుస్తాయి.