అన్నదమ్ముల అనుబంధం...! ఇలాంటి బంధం ఒక్కటి చాలు..!
శ్రీ రాముడు బాల్యంలో తన సోదరులతో కలిసి బంతాట ఆడుతూ..
కొద్దిసేపు తర్వాత తల్లి కౌసల్య ఒడిలో కూర్చొని కేరింతలు కొడుతుంటాడు.
రామా... ఎందుకింత సంతోషంగా ఉన్నావు..? అని ఆమె ప్రశ్నించింది.
ఈరోజు బంతాటలో తమ్ముడు భరతుడు గెలిచాడు అమ్మా అందుకే ఇంత ఆనందం అని బదులిస్తాడు.
ఇంతలో భరతుడు ఏడుస్తూ అక్కడికి వస్తాడు. తన దుఃఖానికి కారణమేమిటని కౌసల్య అడుగుతుంది.
చూడమ్మా... అన్నయ్య కావాలనే ఓడిపోయి నన్ను గెలిపించాడు. అందుకే బాధపడు తున్నానని చెబుతాడు.
అన్నదమ్ములు ఎలా ఉండాలో ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది.
అన్నదమ్ముల అనుబంధానికి ఇలాంటి ఎన్నో కథలు ఉన్నయి.. అందుకే ఆ అనుబంధానికి విలువ ఎక్కువ.
ఎన్ని ఇబ్బందులు , ఒడిదుడుకులు వచ్చిన అన్నదమ్ముల బంధాన్ని వదులుకోవొద్దు అంటారు పెద్దలు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి