అక్కడ స్త్రీ రూపంలో గణపతికి పూజలు.. కారణం అదే.. 

28 June 2025

Prudvi Battula 

కొన్ని ప్రదేశాల్లో వైనాయకి, విఘ్నేశ్వరి, లంబోదరి, గణేశాని అని పిలిచే స్త్రీరూప వినాయకుడి గురించి చాలామందికి తెలియదు.

ఆ పేర్లతోనే ఆలంపుర్‌, భువనేశ్వర్‌లలో హిందూ స్త్రీలు అందరు సర్వసంపదలనిమ్మని వైనాయకి వ్రతం చేస్తుంటారు.

108 రూపాలతో, 16 విశేష రూపాలతో అలరిస్తూ.. 8 రూపాలతో అనేక ప్రాంతాల్లో నిత్యపూజలు అందుకుంటున్నాడు గణేశుడు.

అమ్మ వారు ఓంకార రూపిణి. వినాయకుడూ ప్రణవ రూపుడే. తొండం ఓంకారంలా ఉందని కొందరంటే, గణపతే ఓంకార స్వరూపుడని పురాణాలు స్పష్టం చేశాయి.

వినాయకుడు తన అంశేనని, మంత్ర, యంత్ర, తంత్ర ఉపాసనా విధానాలన్నీ తామిద్దరికీ ఒక్కటేనని ఆదిపరాశక్తి తెలిపింది.

అందుకే వినాయకుణ్ణి సిద్ధి గణపతి, బుద్ధి గణపతి, శక్తి గణపతి, లక్ష్మీ గణపతి, గాయత్రీ గణపతిగా విడివిడిగా ఆలయాల్లో పూజిస్తున్నాం.

లక్ష్మీ సరస్వతులతో కూడిన గణపతి పటం ప్రతి ఇంట్లో ఉంటుంది. హంపీలో తల్లి ఒడిలోనున్న గణపతి విగ్రహం ప్రత్యేక ఆకర్షణ.

‘అంకము చేరి శైల తనయస్తన దుగ్ధములానువేళ..’ అంటూ చెప్పే తల్లిపాలు తాగుతున్న వినాయకుణ్ణి వర్ణించిన పద్యాలెన్నో ఉన్నాయి.