18 December 2023

శబరిమలలో పిల్లలకు ప్రత్యేక దర్శనం.! పూర్తి వివరాలు..

కేరళలోని శబరిమల ఆలయంలో సౌకర్యాలు అంతంత మాత్రమే అన్న విమర్శలపై ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు స్పందించింది.

చిన్నపిల్లలు సులభంగా అయ్యప్ప స్వామి దర్శనం చేసుకునేందుకు తాజాగా  ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసింది. 

క్యూలు, భక్తుల రద్దీతో సంబంధం లేకుండా పిల్లలు ముందు వరుసలో దర్శనం చేసుకోవచ్చు.

పిల్లలకు వీలుగా ప్రత్యేక గేటు వ్యవస్థను ప్రవేశపెట్టినట్టు టీడీబీ తెలిపింది. 

అంతేకాదు పిల్లల సహా మహిళలు, దివ్యాంగులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. 

త్వరలోనే ఉచిత వైఫై సౌకర్యం కూడా కల్పిస్తామని ప్రకటించింది బోర్డ్‌.