దుర్గమ్మ నివాసం.. వింధ్యావాసినీ దేవి ఆలయం గురించి తెలుసా..
26 August 2023
భారతదేశంలోని శక్తిపీఠాల్లో ఒకటి వింధ్యాచల్ ధామ్. గంగానది ఒడ్డున ఉన్న వింధ్యావాసినీదేవి ఆలయాన్ని ఆదిశక్తి స్వరూపంగా భావిస్తారు
వింధ్యాచల్ సమీపంలో ఇతర దైవాల ఆలయాలు ఉన్నాయి. అష్టభుజిదేవి, కాళీఖోఆలయాలు ప్రముఖమైనవి
మహిషాసురుడనే రాక్షసున్ని సంహరించిన తర్వాల దుర్గాదేవి నివసించేందుకు విద్యాంచల్‌ను ఎంచుకున్నట్లు నమ్మకం
నిత్యం వేలాదిమంది భక్తులు విధ్యాంచల్ ఆలయం దర్శిస్తారు. ఆశ్వయుజమాసం నవరాత్రిరోజుల్లో భక్తులసంఖ్య మరింత పెరుగుతుంది
నవరాత్రి సందర్భంగా నగరమంతా దీపాలు, పూలతో అలంకరిస్తారు. వింధ్యపర్వత శ్రేణిలో నివసించేది కనుక వింధ్యవాసిని పేరు వచ్చింది
యోగమాయను వింధ్యవాసిని, మహామాయ, ఏకాంశ పేర్లతో పూజిస్తారు. వైష్ణవ సంప్రదాయంలో యోగమాయను నారాయణి అంటారు
భాగవత పురాణంలో వింధ్యావాసిని దుర్గాదేవి అంశగా పరిగణించ బడుతుంది. దుర్గా సప్తశతిలో ఈఆలయం గురించి ప్రస్తావించబడింది
వింధ్యవాసిని ఆలయాన్ని పాండవులు నిర్మించారని చెబుతారు. భక్తులు గర్భగృహ అనే అతి చిన్న గర్భగుడిలో ఉన్న వింధ్యవాసిని దేవిని దర్శనం చేసుకోవచ్చు