కాలికి నల్లదారం ఎందుకు కట్టుకోవాలి..?
కాలికి నల్ల దారాన్ని కట్టుకోవడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నల్లదారాన్ని కట్టుకుంటే శని దోషం తగలదు.
శని దోషం వలన ఇబ్బంది కలగకూడదంటే శనివారం నాడు కాలికి కట్టుకుంటే మంచిది.
రాహువు కేతువుల బాధలు కూడా ఉండవు. శత్రు గ్రహం ఇంట్లోకి ప్రవేశించి మీ గృహ జీవితానికి ఆటంకం కలిగించవచ్చు.
దీని వల్ల ఆర్ధిక సమస్యలు కలుగుతాయి. అలాంటప్పుడు మీరు ఎడమ కాలికి నల్లటి దారాన్ని కట్టుకుంటే..
రాహు కేతువుల ఆగ్రహం నుండి బయటపడొచ్చు. కుడి కాలికి నల్ల దారాన్ని కట్టుకుంటే ఆర్థిక సమస్యల నుండి కూడా బయటపడొచ్చు.
డబ్బు సమస్యలను కూడా ఇది తొలగిస్తుంది. ఇంటికి మంచిని కలిగిస్తుంది. అలానే ఎవరైనా మిమ్మల్ని చూసి అసూయ చిందితే నరదృష్టి తగులుతుంది.
అలాంటప్పుడు కూడా నల్లదారాన్ని కట్టుకోవడం మంచిది నర దిష్టికి నివారణగా పనిచేస్తుంది నల్లదారం.
ఈ నల్ల దారాన్ని కనపడకుండా దాచుకోవాలి. దీన్ని కట్టినప్పుడు ఇతర రంగుల దారాలని కాళ్ళకి కట్టుకోకూడదు.
మంగళవారం లేదంటే శనివారం నల్లదారాన్ని కాలికి కట్టుకోవడం మంచిది.
నల్లదారాన్ని కట్టుకునెవ్పుడు 22 సార్లు శని మంత్రాన్ని జపిస్తే ఇంకా మంచి జరుగుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి