నవరాత్రి పూజలో ఈ కథ వింటే శుభ ఫలితం.. గణపతి ఆశీస్సులు లభ్యం..
25 August 2025
Prudvi Battula
వినాయక చవితి వ్రతంలో భాగంగా ఒక్కరోజు పూజ చేసేవారు శమంతక ఉపాఖ్యానం వింటే చాలు. తొమ్మిది రోజులు పూజలు చేస్తే మూషికాసుర వృత్తాంతమూ తెలుసుకోవాలి.
దండకారణ్యంలో ఒక మహర్షి తన భార్యతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ భుక్తి గడుపుకొంటూ, ముక్తి కోసం తపస్సు చేస్తూ ఉండేవాడు.
అనింద్యుడనే మూషికరాజు వారు కష్టపడి పండించిన పంటను హరిస్తూ ఉండడంతో వారికి ఎప్పుడు చాల కష్టంగా ఉండేది.
దీంతో.. భరద్వాజ ముని సూచన ప్రకారం... ఆ మహర్షి తన ఇంటి వద్ద భార్యతో కలిసి వినాయక వ్రతం ఆచరించసాగాడు.
ఉద్యాపన చేస్తుండగా మూషికరాజు గణపతి నివేదనలను కూడా హరించడంతో మహర్షి భార్య "అసురుడవై జన్మించు" అని మూషికరాజును శపించింది.
ఫలితంగా యక్షరాజైన కుబేరునికి కొడుకుగా జన్మించిన మూషికరాజు ఒకసారి తండ్రితోపాటు మణిద్వీపానికి వెళ్లాడు.
అక్కడ జగన్మాత పార్వతిదేవి సమక్షంలో ఉన్న ఓ బంగారు పాత్రలోని జ్ఞానామృతాన్ని మూషికంగా మారి ఆస్వాదించాడు.
దాంతో కోపగించిన జగన్మాత మూషికాసురునిగా అసురజన్మ ఎత్తడమే కాక కామక్రోధాది అష్టదుష్ట శక్తులను అంతం చేసినవానికి నీవు దాసుడవు అవుతావని శపించింది.
ఆ విధంగా అష్టదుష్ట శక్తులను అంతం చేసిన వినాయకుడికి మూషికరాజు దాసుడిగా, వాహనంగా మారాడు. ఇదీ.. మూషికాసుర వృత్తాంతం.
మరిన్ని వెబ్ స్టోరీస్
పచ్చి మిరపకాయలు ఇలా కట్ చేస్తే.. చేతులు మంటేక్కావు..
రోజుకు మూడు రంగులు మార్చే 1100 ఏళ్ల లక్ష్మీదేవి విగ్రహం.. ఎక్కడంటే.?
నవరాత్రుల్లో గణేశుడిని రోజుకో రూపంలో పూజిస్తే.. కోరికలన్నీ తీరిపోయినట్టే..