శివుడి ముందు నంది ఎందుకు ఉంటుందో తెలుసా.?

శివాలయంలో గర్భగుడికి ముందు నంది విగ్రహం ఉండటం తెలిసిందే..! అలా స్వామికి ఎదురుగా కొలువుడీరడం వెనుక ఓకథే ఉంది తెలుసా..?

పురాణాల ప్రకారం శిలదా అనే రుషికి సంతానం లేకపోవడంతో తవస్సు చేశాడట.

కొన్నాళ్లకు వరమేశ్వ రుడు అనుగ్రహించడంతో ఆ రుషికి కుమారుడు కలిగాడట, రుషి ఆ పిల్లాడికి నంది అని పేరు పెట్టుకున్నాడు.

చిన్నతనంలోనే నకల కళల్లో ప్రావీణ్యం సాధించిన నందిని చూసి తండ్రి మురిసి పోయేవాడు.

ఓ సారి వరుణ, మిత్ర దేవ తలు శిలదా ఇంటికి ఆతిథ్యానికి వచ్చినప్పుడు ఆ పిల్లాడికి ఆయుర్దాయం లేదని చెప్పారట.

శిలదా ఇదే విషయాన్ని కుమారుడికి చెప్పడంతో తండ్రి బాధను చూడలేక నంది శివుడికోసం తవన్సు చేయడం మొదలు పెట్టాడు.

ఆ తవన్సుకు మెచ్చి శివుడు ప్రత్యకమైనప్పుడు.. స్వామి స్వరూపాన్ని చూసి తన్మయుడైన నంది..

తనకు ఆయుష్షు ఇవ్వమని కాకుండా ఎల్లప్పుడూ పరమేశ్వరుడితోనే ఉండేలా వరం ఇవ్వచంటూ 'వేడుకున్నాడట,

అలా శివుడు తన దగ్గరున్న ఎద్దు రూపాన్ని అతడికి ఇచ్చి తనతోనే అనుక్షణం ఉండమంటూ దీవించాడట.

అప్పటినుంచీ స్వామికి ఎదురుగా నందివిగ్రహమూ ఉంటోందని పురాణ కథ..