భక్తి అంటే ఏంటి..? అసలైన నిర్వచనం తెలిపే పదాలు..
ఆహారంలో "భక్తి" ప్రవేశిస్తే ప్రసాదమౌతుంది.
ఆకలికి "భక్తి" తోడైతే ఉపవాసమౌతుంది.
నీటిలో "భక్తి" ప్రవేశిస్తే తీర్థ్ధమౌతుంది.
యాత్రకి "భక్తి" తోడైతే తీర్థయాత్ర అవుతుంది.
సంగీతానికి "భక్తి" కలిస్తే కీర్తనమౌతుంది.
గృహంలో "భక్తి" ప్రవేశిస్తే దేవాలయమౌతుంది.
సహాయంలో "భక్తి" ప్రవేశిస్తే సేవ అవుతుంది.
పనిలో "భక్తి" ఉంటే పుణ్యకర్మ అవుతుంది.
"భక్తి" ప్రవేశిస్తే మనిషి మనీషి అవుతాడు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి