దేవతలు , దేవుళ్ళు కలలో కనిపిస్తే ఎం జరుగుతుంది.?

మనం తరచూ కలలు కంటుంటాం. చాలామందికి నిత్యం తమ జీవితాల్లో జరిగే విషయాలు, అంశాలు కలల్లో కనిపిస్తుంటాయి.

అయితే మీకు ఎప్పుడైనా కలలో దేవుడు కనిపించాడా.? ఒకవేళ మీ కలలో దేవుడు కనిపిస్తే ఏం జరుగుతుంది.?

కలలో శివుడిని చూసినట్లయితే, మీరు సమస్యల నుంచి అతి త్వరలో విముక్తి పొందనున్నట్లు అర్ధం.

శివుడు కలలోకి వచ్చాడంటే... అన్ని ఇబ్బందులు తొలిగినట్లే.

అంతేకాకుండా మీ కలలో శివలింగాన్ని చూసినట్లయితే, ఆ కల కూడా ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు.

మీ జీవితంలో పురోగతి, కీర్తిని పొందుతారని దాని సంకేతం.

మీ కలలో లక్ష్మీదేవి కమలంపై కూర్చున్నట్లు కనిపిస్తే, అది చాలా పవిత్రమైన కలగా పరిగణిస్తారు.

ఈ కల సంపదకు చిహ్నం, కలలో లక్ష్మీ మాతను చూస్తే... మీకు డబ్బు త్వరలోనే లభిస్తుందని లాభాలను పొందుతారని అంటారు.