దేవుని గుడిలో కొబ్బరికాయను ఎందుకు కొడతారో తెలుసా..?
సర్వదేవతలను పూజించే సమయాల్లోనూ, యజ్ఞ, హోమాదుల్లోనూ, కొన్ని శుభకార్యాల్లోనూ కొబ్బరి కాయను కొట్టడం తప్పని సరి.
కొబ్బరి కాయపైనున్న పెంకు మన అహంకారానికి ప్రతీక,
ఎప్పుడైతే కొబ్బరి కాయను స్వామి ముందు కొడతామో మనం మన అహంకారాన్ని విడనాడుతున్నామనీ..
లోపలున్న తెల్లని కొబ్బరిలా మన మనసును సంపూర్ణంగా స్వామి ముందు పరిచామని..
తద్వారా నిర్మలమైన కొబ్బరినీరులా తమ జీవితాలని ఉంచమని అర్థం.
సృష్టి మొత్తంలో నీరున్న కాయ కొబ్బరి కాయే. కొబ్బరికాయ అంటే మానవ శరీరం.
బొండం పైనున్న చర్మం, మన చర్మం. పీచు మనలోని మాంసము, పెంకే ఎముక, కొబ్బరే ధాతువు, అందులోని కొబ్బరినీరు మన ప్రాణాధారం.
బొండం పైనున్న చర్మం, మన చర్మం. పీచు మనలోని మాంసము, పెంకే ఎముక, కొబ్బరే ధాతువు, అందులోని కొబ్బరినీరు మన ప్రాణాధారం.
ఇక్కడ క్లిక్ చెయ్యండి