సునామీ సైతం తాకని సముద్రతీర ఆలయం ఎక్కడంటే.. 

30 July 2024

TV9 Telugu

Pic credit - Social Media

కేరళలో ఉన్న కట్టిల్‌ మెక్కతిల్‌ భాగవతి అమ్మవారు చాలా ప్రత్యేకం. భద్రకాళిలా దర్శనమిస్తుంది. అమ్మవారి మహిమ గురించి భక్తులు కథలు కథలుగా చెబుతారు.

అమ్మవారి మహిమ 

2004లో ఇండోనేషియా తీరంలో ఏర్పడిన సునామీ అల్లకల్లోలం సృష్టించింది. కేరళ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ఎన్నో ప్రాంతాలు కూడా నీట మునిగాయి. 

సునామీ అల్లకల్లోలం

కొల్లాం జిల్లాలో అరేబియా సముద్రానికి, జలమార్గానికి మధ్య ఉన్న చిన్న దీవిలో ఉన్న కట్టిల్ మొక్కతిల్ భాగవతి అమ్మవారి ఆలయం మాత్రం చెక్కుచెదరలేదు. 

చిన్న దీవిలో ఆలయం

ఈ దీవిలో భాగవతి అమ్మవారు చంపక్కులం నుంచి మొసలిపై వచ్చి స్వయంభువుగా వెలిశారని స్థల పురాణం. 

స్వయంభువు

ఈ ఆలయంలో అమ్మవారే స్వయంగా దీపం వెగిలించారట అందుకే ఆ దీపం కొండెక్కదని.. ఎప్పుడూ దీపం వెలుగుతూనే ఉంటుందని చెబుతారు.

కొండెక్కని దీపం 

కేరళ పాలకుల్లో అగ్రవీరుల్లో ఒకరైన రాజా మార్తాండవర్మ ఈ ఆలయానికి వెళ్లి అమ్మవారిని ఆరాధించి అక్కడే ఓ భవంతి నిర్మించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. 

రాజా మార్తాండవర్మ

అమ్మవారికి మొక్కుకున్న భక్తులు తమ కోరికలు తీరిన అనంతరం ఇత్తడి గంటలను సమర్పిస్తారు. ఆ గంటలను ఆలయ ప్రాంగణంలో ఉన్న మర్రిచెట్టు కొమ్మలకు కడతారు. 

గంటలిస్తే చాలు

నెలకు దాదాపు 4 లక్షల గంటలు కడతారని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. పెద్ద మర్రిచెట్టు మొత్తం గంటలతో నిండిపోయి కనిపిస్తుంది. 

 మర్రిచెట్టు

ఓ సారి ఆలయ ధ్వజస్తంభం నుంచి ఓ గంట కిందకు పడిపోయిందట. అప్పుడు ఒక పూజారి గంటను తీసి మర్రిచెట్టు కొమ్మకు కట్టాడట. తర్వాత అర్చకుడి జీవితంలో అద్భుతం చోటుచేసుకుందట

ఎప్పుడు మొదలైందంటే 

అర్చకుడి జీవితంలో జరిగిన మార్పులతో భక్తులు తమ కోరిక తీరిన తర్వాత గంటలు కట్టే సంప్రదాయం మొదలైందని స్థానికులు చెబుతున్నారు. 

కోరిక తీరిన తర్వాత