తాబేలును ఇంట్లో పెట్టుకోవచ్చా.? పెట్టుకుంటే జరిగే పరిణామాలు ఇవే..
తాబేలు ప్రతిమ ని ఇత్రడిలో గాని, క్రిస్టల్ లో గాని తీసుకొని దానిని ఇత్తడి ప్లేట్‌లో గాని..,
పింగాణి లేదా గాజు పాత్రలో గాని నీటిని పోసి తాబేల్ ని ప్లేట్‌తో సహా ఉత్తరం దిక్కున ఉంచాలి.
ప్రతిరోజు ఉదయాన్నే ప్లేట్లో ఉన్న నీటిని తీసివేసి కొత్త నీటిని పోసి ఉత్తరం దిక్కున ఉంచాలి.
ప్లేట్ లో నీటిని పోసేటప్పుడు మన మనస్సులో ఉన్న కోరికలను తలచుకుంటు నీటిని 'పోయాలి.
తాబేలు ని విష్ణు భగవానుడి స్వరూపంగా కొలుస్తారు. వాస్తు శాస్త్రం రీత్యా ఉత్తరం దిక్కు బుధుడికి చెందిన దిక్కు అని,
ఉత్తరం కుబేర స్థానంగా భావిస్తారు.తాబేలుని నీటిలో ఉంచి ఉత్తరం దిక్కున ఉంచటం వలన బుధగ్రహా దోషాలు తొలిగిపోతాయి.
తాబేలు ఉన్న ఇంటి లో పిల్లలు అందరు మంచి విద్యతో విద్యావంతులుగా ఎదుగుతారు. మంచి వాక్ శుద్ధితో భావప్రకటన చేయగల సామర్థ్యం కలిగి ఉంటారు.
తాబేలు ఉన్న ఇంటిలో వాస్తు దోషాలు ఉంటే కొంత వరకు దోష నివారణ జరుగుతుంది. ఆ ఇంటిలో ఉన్నమనుషులకు మానసిక ప్రశాంతత కలుగుతుంది.
తాబేలు ఉన్న ఇంటిలో ధనానికి ఎటువంటి లోటు ఉండదు.వ్యాపార సముదాయంలో ఉంచితే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి